Skip to main content

Namaste NRI

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి గ్లింప్స్ విడుదల

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్న హారర్‌ మిస్టరీ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తాజాగా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర‌యూనిట్. గ్లింప్స్ చూస్తుంటే మంత్రాల‌తో మూసివేయ‌బ‌డిన ఒక పాత మ‌హాల్‌లోకి హీరో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్లిన అనంత‌రం ఆ మ‌హాల్‌లో ఏం జ‌రిగింద‌నేది ఈ సినిమా అని తెలుస్తుంది. గ్లింప్స్‌లో చూపించిన సీన్స్ చూస్తుంటే ఉత్కంఠభరితంగా ఉండబోతోందని తెలుపుతున్నాయి.

బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌లు చేతిలో టార్చ్‌లు పట్టుకొని అడవిలో ఏదో వెతుకుతూ, ఎక్సయిటింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోస్టర్‌లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న పాడుబడ్డ బంగ్లా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ నెల 29న ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్‌ సలాస్కర్‌, సంగీతం: సామ్‌ సిఎస్‌, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్‌ స్క్రీన్స్‌.

Social Share Spread Message

Latest News