Skip to main content

Namaste NRI

శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న భాగ్ సాలే ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న భాగ్‌సాలే చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరిష్‌ శంకర్‌ క్లాప్‌నివ్వగా సురేష్‌బాబు కెమెరా స్విఛాన్‌ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. శ్రీసింహా పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది అని తెలిపారు. జాన్‌ విజయ్‌, రాజీవ్‌ కనకాల, వెన్నెల కిషోర్‌, నందినీరాయ్‌, సుదర్శన్‌ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సుందర్‌ రామకృష్ణన్‌, ఎడిటింగ్‌ : సత్య గిడుటూరి. సురేష్‌బాబు సమర్పణలో యస్‌ రంగినేని, శింగనమల కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకుడు.

Social Share Spread Message

Latest News