Namaste NRI

కిరణ్‌ అబ్బవరం బర్త్‌డే కానుకగా.. వినరో భగ్యము విష్ణుకథ టీజర్‌

కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పర్దేశీ జంటగా నటిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. దర్శకులు ప్రశాంత్‌ నీల్‌, కిషోర్‌ తిరుమల వద్ద చేసిన మురళీ కిషోర్‌ అబ్బురూ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నేడు (జూలై 15) కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా వినరో భాగ్యము విష్ణుకథ టీజర్‌ని విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేది నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా అంటూ టీజర్‌ ఆసక్తికరమైన సంభాషణతో సాగింది. కిరణ్‌ అబ్బవరం లుక్స్‌ కొత్తగా ఉన్నాయి. కుటుంబ కథా చిత్రమిది. హృదయాల్ని తడిమే భావోద్వేగాలుంటాయి అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా సెప్టెంబరు 30న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌,  కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సత్య గమిడి, శరత్‌ చంద్ర నాయకుడు, సహనిర్మాత: బాబు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events