Namaste NRI

భజే వాయు వేగం ట్రైలర్‌ విడుదల

కార్తికేయ  కథానాయకుడిగా న‌టిస్తున్న చిత్రం భజే వాయువేగం. ఐశ్వర్య మీనన్‌ కథానాయిక. ప్రశాంత్‌రెడ్డి దర్శకుడు. యూవీ కాన్సెప్ట్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌ ఐమాక్స్‌లో ఘనంగా విడుదల చేశారు. కార్తికేయ  మాట్లాడుతూ ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో, ఎలాంటి ఎమోషన్లు నా సినిమాలో ఉండాలని కోరుకున్నానో, ఎలాంటి కేరక్టర్‌ పోషించాలని ఆశించానో అవన్నీ వందశాతం కుదిరిన సినిమా భజే వాయువేగం అని అన్నారు.  కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. చూస్తున్న వారు కథలో లీనమైపోతారు. మేమింత కాన్ఫిడెంట్‌గా ఉన్నామంటే కారణం దర్శకుడు ప్రశాంత్‌.మా టీమ్‌కు వెలకట్టలేని సంతృప్తినిచ్చిన సినిమా ఇది అని చెప్పారు.

ఇదొక ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అని, పోస్ట్‌ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం తీసుకున్నామని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ మీకు తెరపై తెలుస్తుందని, అసాధారణ సమస్యలో ఇరుక్కున్న ఓ కామన్‌మ్యాన్‌ అందులోనుంచి ఎలా బయట పడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అని దర్శకుడు పేర్కొన్నారు. కథానాయిక ఐశ్వర్యమీనన్‌తో పాటు చిత్ర బృందం అంతా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్‌, కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]