తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలికి చెందిన ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం పూర్తయినందున, నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను కమిటీ ఎన్నుకున్నది. నూతన అధ్యక్షునిగా ప్రముఖ పంపిణీదారుడు పి.భరత్ భూషణ్, ఉపాధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. 2024-25 సంవత్సరానికి గాను ఈ సభ్యులు పనిచేయడం జరుగుతుంది. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి గత అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వ్యవహరించిన విషయం తెలిసిందే.