Skip to main content

Namaste NRI

భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి.. థియేటర్స్ లో కలుద్దాం

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ రోల్‌ చేస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహ‌ర్‌ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.  మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్ అందించాడు చిరంజీవి.

భోళాశంకర్ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు చిరు. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్స్ షేర్ చేస్తూ, భోళాశంకర్ డబ్బింగ్ పూర్తయింది. సినిమా రూపుదిద్దుకున్న తీరు చూసి చాలా ఆనందంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్‌లో డేట్స్‌ను గుర్తుంచుకోండి. ఆగస్టు 11న థియేటర్లలో కలుద్దామన్నారు.ఈ  చిత్రంలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News