Namaste NRI

సీతారామం నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం సీతారామం. రష్మిక మందన్న, సుమంత్‌, భూమిక చావ్లా, గౌతమ్‌ మేనన్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భూమిక మృణాళిని అనే గృహిణి పాత్రలో కనిపించనున్నారు. బ్రిగేడియర్‌ విష్ణుశర్మ పాత్ర పోషిస్తున్న సుమంత్‌కి ఆమె భార్యగా నటిస్తున్నారు. చిన్నారి ఊహాతో కలిసి ఉన్న లుక్‌ని సినీ వర్గాలు విడుదల చేశారు. సుమంత్‌ హీరోగా నటించిన యువకుడు సినిమాతో తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంటీ ఇచ్చింది భూమిక. మళ్లీ చాలా ఏండ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై  అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు.  పీఎస్‌ వినోద్‌ ఛాయాగ్రాహకుడు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events