చట్టపరమైన వలసదారుల పిల్లలకు చట్టపరమైన పౌరసత్వాన్ని అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 21 ఏళ్లు నిండిన యువకులు, ముఖ్యంగా భారతీయులను దేశం నుండి బహిష్కరిస్తారనే ఆందోళనల నడుమ ఈ ప్రకటన ఊరటనిచ్చిట్లయింది. డాక్యుమెంట్ డ్రీమర్స్‌గా పిలిచే ఈ పిల్లలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారులతో సహా నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్‌లపై దీర్ఘకాలికంగా ఆధారపడి జీవిస్తున్నారు. హెచ్ 1బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది విదేశీ ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తోంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పది వేల మంది ఉద్యోగులను నియమించడానికి టెక్ కంపెనీలు దీనిపై ఆధారపడి ఉంటాయి.