అమెరికా పిట్స్‌బర్గ్‌లో బతుకమ్మ పండుగ ను ప్రవాసులు ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 350 మందికి పైగా తెలంగాణ ఆడపడుచులు హాజరై.. బతుకమ్మ పండుగను సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి, మలీదా ప్రసాదాన్ని పంచుకున్నారు. ఇక వేడుకల్లో ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. వేడుకల తర్వాత తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించారు. ఒకే చోట అందరూ కలిసి బతుకమ్మ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, వాలంటీర్లకు, స్పాన్సర్లకు కన్వీనర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.














