భరత్, బిగ్‌బాస్ ఫేమ్ దివి జంటగా నటిస్తున్న చిత్రం లంబసింగి. కల్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఏ వ్యూర్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. ఈ నెల 16న నచ్చేసిందే వచ్చేసిందే.. అంటూ సాగే పాటని విడుదల చేస్తున్నాం. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రొమాంటిక్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంటున్నది. హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం సమకూర్చారని సినీ వర్గాలు తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత పేర్కొన్నారు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణ సంస్థ : కాన్సెప్ట్ ఫిల్మ్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: నవీన్ గాంధీ.














