Namaste NRI

తెలంగాణలో బీజేపీకి భారీ షాక్… రాజీనామా చేసిన మోత్కుపల్లి

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలిపారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

                మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ మీద విశ్యాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. దళితబంధు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో టీడీపీ లేదని, తన పాత్ర మిత్రులంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని ఆయన కోరారు. మోత్కపల్లి తర్వలోనే టీఆర్‌స్‌లో చేరే అవకాశముంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events