ఎఫ్3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదట ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు, యూనివర్షల్‌గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్3ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది అని పేర్కొంది ఎఫ్ 3 చిత్ర యూనిట్. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ పాండమిక్‌లో యూత్, మాస్ మాత్రమే థియేటర్‌లకు వచ్చేవారు. మేం కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావాలనే లక్ష్యంతో సినిమా చేశాం. ఇవాళ మా అంచనా నిజమైంది అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఉదయం నుంచి సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తున్నది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మా సంస్థకు హ్యాట్రిక్ విజయం దక్కింది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది అన్నారు. చిత్రబృందం అంతా రెండేళ్లు ఒక కుటుంబంలా కలిసి పనిచేశాం. ఇమేజ్ ఉన్న హీరోలతో కామెడీ పండిరచడం సంతోషంగా ఉంది అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో ప్రభంజనం సృష్టించింది.














