Skip to main content

Namaste NRI

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్‌ తెలుగు సమాజం మరోసారి రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.  నవంబరు 27, 28 తేదీల్లో స్థానిక హెల్త్‌ సర్వీసెస్‌ అథారిటీ సింగపూర్‌ బ్లడ్‌ బాంక్‌ నందు ఈ కార్యక్రమం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరుసగా ఆరోసారి బ్లడ్‌ డొనేషన్‌ నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో 40 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు తెలిపారు. రక్తదానం పట్ల ఆసక్తి ఉన్న ఇతర దాతలు తర్వాత రోజుల్లో కూడా ఆర్‌0284 కోడ్‌ ఉపయోగించి రక్తదానం చేయవచ్చన్నారు.

                ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల  సింగపూర్‌ తెలుగు సమాజనికి, రెడ్‌క్రాస్‌తో పాటు బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News