భారతీయ సినీ చరిత్రలో ఓ మహోజ్వల శకం ముగిసిపోయింది. బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్‌కుమార్ (98) తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్‌కుమార్ స్టార్‌గా వెలుగొందారు. కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితులు, కటుంబ సభ్యుల మధ్య అధికారిక లాంఛనాలతో, శాంతాక్రూజ్‌లోని శ్మశానవాటికలో దిలీప్‌కుమార్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై త్రివర్ణ పతాకంపై కప్పి, గన్ సెల్యూట్‌తో తుది వీడ్కోలు పలికారు. నాటి ప్రముఖ నటి సైరా బాను దిలీప్‌కుమార్ భార్య.
దిలీప్‌కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నిషాన్ ఇంతియాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు.