Skip to main content

Namaste NRI

హరిహర వీర మల్లు కోసం బాలీవుడ్ భామ నర్గీస్

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీర మల్లు కోసం బాలీవుడ్‌ భామ నర్గీస్‌ ఫక్రీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.  క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె యువరాణిగా సందడి చేయనున్నట్టు సమాచారం. నర్గీస్‌ ఫక్రీ త్వరలోనే సెట్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. మొఘలాయిల కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా యుద్ద విద్యల్లో తర్ఫీదు కూడా పొందారు. ఆయన ఇందులో ఓ బందిపోటుగా కనిపిస్తారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌ హరిహర వీరమల్లుపై అంచనాల్ని పెంచింది. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం తొలుత ప్రకటించిన విడుదల తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29.

Social Share Spread Message

Latest News