Skip to main content

Namaste NRI

ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించాలి

ఇటీవలి కాలంలో ఇండియా, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతంలోనే అంతంతమాత్రంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ల తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరకు పాకిస్తాన్‌కు నీళ్లు కూడా ఇవ్వకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. ఏడాదిపైగా ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ ఇండియా, పాకిస్తాన్‌లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఇండియా నుంచి 61 మంది, పాకిస్తాన్‌ నుంచి 56 మంది ప్రముఖులు ఉన్నారు.

ఇరు దేశాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న తమ శతృత్వాన్ని పక్కనబెట్టాలని లేఖలో కోరారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన వల్ల రెండు దేశాలకు చెందిన లక్షలాది మంది యువత ఇబ్బంది పడుతున్నారని, అనేక అవకాశాలు కోల్పోతున్నారని, ఆర్థికపరంగా నష్టం కలుగుతోందని లేఖలో వివరించారు. విశ్వాసం పెంపొందించేందుకు ఇరు దేశాల నేతలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సేవలు తిరిగి పునరుద్ధరించాలని, సాధారణ వీసా సేవలు, విమానయాన సేవలు ప్రారంభించాలని కోరారు. రెండు దేశాల సరిహద్దు అయిన అట్టారి-వాఘా మార్గాన్ని తెరవాలని, వ్యాపారం, వాణిజ్యం, పర్యటనలకు అవకాశం కల్పించాలని లేఖలో ప్రస్తావించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events