Namaste NRI

తెలంగాణ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ … మహేశ్ బిగాల

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలకు ఆంక్షలకు అనుగుణంగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో చూసుకుంటే నీటిపారుదల రంగానికి, వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు.  విద్యాశాఖ‌కు రూ.19,093 కోట్లు కేటాయించారని, ఈ కేటాయింపులతో విద్యారంగంలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎనిమిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎనలేని పురోగతి సాధిస్తుందన్నారు. ప్రభుత్వం, సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రగతి ఫలాలు అందివస్తున్నాయన్నారు. మన ఊరూ – మన బడి కార్యక్రంమ అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంన్నారు. అన్ని వ‌ర్గాల క‌ల‌లు సాకారం చేసే బడ్జెట్ ఆమోదించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

……..

Social Share Spread Message

Latest News