Skip to main content

Namaste NRI

అమెరికాలో కార్చిచ్చు కలకలం!

అమెరికాలో కార్చిచ్చు కలకలం కొనసాగుతోంది. ఉత్తర కాలిఫోర్నియాలో దావానలం మరింత చెలరేగడంతో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నెల 14న ఇక్కడి కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసింది. తాజాగా ఇండియన్‌ పాల్స్‌ పట్టణంలో పదుల కొద్దీ ఇళ్లకు నిప్పు అంటుకుంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1.8 లక్షల ఎకరాలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ఇక్కడి నాలుగు  ఉత్తర కౌంటీలకు కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌న్యూసమ్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు దక్షిణ ఒరిగాన్‌లో దావానలాన్ని అగ్నిమాపక దళం 2200 మంది కలిపి అదులపోకి తీసుకొచ్చేందుకు చెమటోడుస్తున్నారు. మొత్తంగా అమెరికా వ్యాప్తంగా 85 చోట్ల దావానలం వ్యాప్తిస్తోంది. వాటిలో అత్యధికంగా పశ్చిమ రాష్ట్రాలే ఉన్నాయి. 14 లక్షల ఎకరాల భూమిని అగ్ని దహించినట్లు అంచనా.

Social Share Spread Message

Latest News