పర్యాటక వీసాలపై భారతీయులు తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలకం, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని చెప్పింది. ప్రయాణికులు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి తెలిపింది.