దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వచ్చే నెలలో ధర్డ్‌వేవ్ మొదలు కానుందన్న ఆందోళన మధ్య కరోనా కేసుల పెరుగుదల బెంబేలెత్తిస్తోంది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం…గడిచిన 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 817 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 3,07,09,557 మంది కరోనా బారిన పడగా.. కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 4,05,028గా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,60,704 క్రియా శీలక కేసులు ఉన్నాయి. రికవరీల సంఖ్య 2,98,43,825కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,05,028 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు తీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 36.48 కోట్లకు చేరింది.