ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్దన్ సహా ఏకంగా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. అలాగే 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. అలాగే 36 కొత్త వారికి చోటు కల్పిస్తూ మొత్తం 43 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ప్రభుత్వంలో మొత్తం మంత్రుల సంఖ్య 77కు చేరుకుంది. కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత నారాయణ్ రాణే, చివరగా నిషిత్ ప్రామాణిక్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా ప్రొటోకాల్ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే.