Skip to main content

Namaste NRI

కచ్చితంగా ఇది ఆందోళన కలిగించే అంశమే

ఉత్తరకొరియాలో విజృంభిస్తుశ్రీన్న కరోనా వైరస్‌ కారణంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. నార్త్‌ కొరియాలో లక్షలాదిమంది ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వార్తలు తాజాగా వెలుగులోకి రావడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడి తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్‌ మైక్‌ ర్యాన్‌ మాట్లాడుతూ కచ్చితంగా ఇది ఆందోళన కలిగించే అంశమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాన కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వాడాల్సిందేనని అన్నారు. వైరస్‌ ఇలాగే వ్యాప్తి చెందితే కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని  హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News