Namaste NRI

మెల్ బోర్న్ లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  73వ జన్మదిన వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా సభ్యులు కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.  ఈ సందర్భంగా టీడీపీ ఎన్నారైలు చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్  సరి అయిన గాడిలో పడాలి అంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం అని వారు తెలిపారు. వచ్చేసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం  జెండా ఎగరడం ఖాయమని వారు అన్నారు. విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events