Skip to main content

Namaste NRI

లారెన్స్‌ హీరోగా చంద్రముఖి 2… ప్రాజెక్టు వివరాలివే

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రముఖి 2 పేరుతో మరో చిత్రానికి రంగం సిద్ధంమైంది.  రెండో చంద్రముఖిలో హీరోగా రాఘవ లారెన్స్‌ నటించనున్నారు. 17 ఏండ్ల తర్వాత సిల్వర్‌ స్కీన్‌పై చంద్రముఖి 2 మళ్లీ భయపెట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  మేకర్స్‌ ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల  చేశారు.  ఓ బంగ్లాలో బంగారు వర్ణంలో కొద్దిగా తెరిచి ఉంచిన పెద్ద తలుపులు పోస్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కనిపిస్తున్నాయి. చంద్రముఖిలో తన కామెడీతో నవ్వించిన లెజెండరీ కమెడియన్‌ మరోసారి సందడి చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులో ఓ అందాల తార ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించనుందట. ఇంతకీ ఆ క్రేజీ ఆఫర్‌ను ఏ భామ కొట్టేసుందోనని ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నారు సినీ జనాలు. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు.

Social Share Spread Message

Latest News