Skip to main content

Namaste NRI

చౌర్యపాఠం టీజర్‌ లాంచ్‌

ఇంద్రరామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం చౌర్యపాఠం. నిఖిల్‌ గొల్లమారి దర్శకుడు. నక్కిన త్రినాధ రావు నిర్మాత. పాయల్‌ రాధాకృష్ణ, రాజీవ్‌ కనకాల, మస్త్‌ అలీ తదితరులు నటిస్తున్నారు.  ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను లాంచ్‌ చేశారు. క్రైమ్‌ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామంలో దోపీడీ కోసం తన ముఠాను హీరో సన్నద్ధం చేసే సన్నివేశాలతో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ైస్టెలిష్‌ మేకింగ్‌, కామెడీ అంశాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని అద్భుతమైన కథనందించాడని, ప్రతిభావంతులైన టీమ్‌తో రూపొందించామని నిర్మాత నక్కిన త్రినాధ రావు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ రాబరీ నేపథ్యంలో సాగే కథాంశమిది. ఆద్యం తం ఉత్కంఠ, వినోదంతో సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కథ, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: డేవ్‌జాంద్‌, నిర్మాణ సంస్థ: నక్కిన నరేటివ్స్‌, దర్శకత్వం: నిఖిల్‌ గొల్లమారి.

Social Share Spread Message

Latest News