అమరావతి కి రాజమార్గం వచ్చేసిందని, రాజధాని నిర్మాణం ఆపడం ఇక ఎవరి తరం కాదని ,అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధానిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా, ఇప్పటికే చేస్తున్న వైకాపా దుర్మార్గులతో రాష్ట్రానికి పెను ప్రమాదం అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. విజన్ లేని వ్యక్తులు చెప్పే మాటలు వినద్దు అని రాజధాని రైతులకు సూచించారు. 2028 నాటికి అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్ది ప్రధాని నరేంద్ర మోది చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతిని విజయవాడ మంగళగిరి రహదారితో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు, బకింగ్ హోమ్ కాలువ పై నిర్మించిన స్టీల్ వంతెనను మంత్రుల తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు.


రాజధాని అమరావతి లో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ ఇ-3 రోడ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతులు, స్థానిక ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


















