Skip to main content

Namaste NRI

అమెరికా వార్నింగ్ ఇచ్చిన చైనా

బీజింగ్‌ ఒలింపిక్స్‌కు దౌత్యవేత్తలకు పంపబోమని ప్రకటించి దౌత్య యుద్ధానికి అగ్రర్జాం అమెరికా తెరదీసింది. ఆ తర్వాత బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా వంటి మరిన్ని దేశాలూ  అమెరికా బాటలోనే నడిచాయి. దీనిపై చైనా స్పందించింది. అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చింది. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌ బిన్‌ మాట్లాడుతూ ఒలింపిక్స్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నాయని అన్నారు. ఆ తప్పునకు మూల్యం చెల్లించుకోక తప్పదని, వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆ దేశాలు బహిష్కరించినంత మాత్రాన తమకేమీ నష్టం లేదని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్‌ ఒలింపిక్స్‌ కు మద్దతుగా నిలిచాయన్నారు. కొంతమంది దేశాధినేతలు, రాజకుటుంబీకులు ఒలింపిక్స్‌ కు వస్తున్నారని  పేర్కొన్నారు. బ్రిటన్‌, కెనడా ప్రతినిధులను తాము ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ మొదలుకానున్నాయి. అదే నెల 20న ముగియనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events