Namaste NRI

భారత విద్యార్థులకు చైనా తీపి కబురు

 భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురందించింది. చైనాలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కరోనాతో 2020లో స్వదేశానికి తిరిగి వచ్చారు. కరోనాతో చైనా  ఇప్పటివరకు విదేశీ విద్యార్థులను అనుమతించలేదు. ఈ విషయమై భారత్‌లో చైనా రాయబారి సన్‌వైడంగ్‌ స్పందించారు. చైనాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు త్వరలో భారతీయ విద్యార్థులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. తొలి బ్యాచ్‌ భారత విద్యార్థులు త్వరలో చైనాకు బయలుదేరి వెళతారని సన్‌వైడంగ్‌ అన్నారు. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యాకోర్సులు పూర్తి చేసేందుకు రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events