Skip to main content

Namaste NRI

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. జో బైడెన్‌ భేటీ!

వచ్చే నవంబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆగ్నేయాసియాలో పర్యటించనున్నారు. ఆగ్నేయాసియా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు విదేశీ అధినేతలతోనూ జీ జిన్‌పింగ్‌ భేటీ కానున్నారు. నవంబర్‌లో ఇండోనేషియాలో జీ`20 దేశాధినేతల సదస్సు జరుగనున్నది. జీ జిన్‌పింగ్‌తో ముఖాముఖీ సమావేశం విషయమై జో బైడెన్‌ టీం ఇంకా దృవీకరించలేదు. వాణిజ్య సంబంధ సమస్యలు, తైవాన్‌ వివాదంపై రెండు దేశాల మధ్య ఉద్రికత్తల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బైడెన్‌, జిన్‌పింగ్‌ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌తో ముఖాముఖీ భేటీ సమయం, స్థలం చెప్పలేమని అమెరికా అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News