Namaste NRI

చిత్రాలయం స్టూడియోస్‌ కొత్త చిత్రం ప్రారంభం

శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్‌ సంస్థ అధినేత వేణు దోనేపూడ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు.  దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య అందించిన కథతో జర్నీ టు అయోధ్య అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాని తీస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రామాయణం ఆధారంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొం దుతున్న చిత్రమిది.  ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వి.ఎన్‌. ఆదిత్య నేతృత్వంలోని ఒక బృందం అయోధ్య సహా పలు ప్రాంతాల్లో లొకేషన్ల కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అందులో పేర్కొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహించనున్నా రు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.  2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్‌ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events