Skip to main content

Namaste NRI

వైభవంగా లష్కర్‌ బోనాలు.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

లష్కర్‌ బోనాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులకు పూజారులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ఆహ్వా నం మేరకు సీఎం కేసీఆర్‌ దంపతులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. పద్మారావుగౌడ్‌ నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎండోమెంట్స్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News