Skip to main content

Namaste NRI

మస్కట్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఒమన్ రాజధాని మస్కట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు  మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించిన తీరును కొనియాడారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా భూకంపం ధాటికి అతలాకుతలమైన సిరియా, తుర్కియేలోని బాధితులకు పాల పొడి ప్యాకెట్లు, బ్లాంకెట్లు, ఇతరాత్ర వస్తువులు ఆ దేశాల రాయబార కార్యాలయ అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ కార్యవర్గ సభ్యులు బైసింగరపు వినోద్ కుమార్ యాదవ్, దినేష్, రాజేందర్, గంగాధర్, శ్రీనివాస్ నాగం, శ్రీనివాస్, అక్తర్, కనకరాజు, గణేష్,  నర్సయ్య, బొద్దుల కృష్ణ, కృష్ణ, సాయి కిరణ్ రెడ్డి, రంజిత్, వంశీ, రాజు, వేణు, కాశీరామ్, రాజేంధర్, శంకర్, గాంధారి నరేష్, కొత్త చిన్నయ్య, సాయి కృష్ణ, జాబేర్ పాషా, దాసుతో పాటు పార్టీ నాయకులు, సీఎం కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News