Namaste NRI

కలర్స్‌ స్వాతి ఇడియట్స్‌ ఫస్ట్‌ లుక్‌

కలర్స్‌ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇడియట్స్‌. నిఖిల్‌ దేవాదుల, సిద్దార్థ్‌ శర్మ, శ్రీ హర్ష ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకథగా, వినోదాత్మక అంశాలతో రూపొందుతోంది. రియల్‌ హీరోస్‌ అనే ఉప శీర్షికని ఖరారు చేశాం. ఈ కథలో రియల్‌ హీరోస్‌ ఎవరనేది ఆసక్తికరం, కచ్చితంగా ఓ కొత్త రకమైన చిత్రంగా ప్రేక్షకుల మనసుల్ని గెలిచే చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. నవీన్‌ మేడారం షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ముగ్గురు విద్యార్థులు చేసే అల్లరి పనులు, వాటికి ఉపాధ్యయులు ఇచ్చిన పనిష్‌మెంట్‌ను ఫస్ట్‌ లుక్‌లో చూపించారు. నిత్యశ్రీ, సురేష్‌, రాజేందర్‌ గౌడ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్‌ సదాశివును సంగీతాన్ని అందిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌, అమోఘ ఆర్ట్స్‌, ఎంఎస్‌ఓపీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్‌. అభిషేక్‌ నామా నిర్మాత.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events