Skip to main content

Namaste NRI

హైదరాబాద్ నుంచి కొలంబోకు విమాన సర్వీసులు ప్రారంభం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీలంక రాజధాని కొలంబోకు జీఎంఆర్‌, శ్రీలంక అధికారులు విమాన సర్వీసు ప్రారంభించారు. 18 నెలల తరువాత కొలంబోకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 120 మంది ప్రయాణికులతో మొదటి విమానం బయలుదేరి వెళ్లింది. శంషాబాద్‌`కొలంబో మధ్య వారానికి రెండు సార్లు సోమవారం, శుక్రవారం సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్ద ఎత్తున్న ప్రయాణికులు అక్కడికి వెళ్తారని అందుకోసమే విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. శ్రీలంక, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీస్‌కు ఆదరణ లభిస్తోందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News