Namaste NRI

ఘనంగా ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో

సామాన్యుల కల సాకారం చేసేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ వేదికగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. ఇందులో భాగంగా క్రెడాయ్‌ అధ్యక్షుడు రామకృష్ణరావు, జనరల్‌ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డిలు విచ్చేసి వివిధ కెటగీరిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు స్టాల్స్‌ నిర్వాహకులను వారి  చేతుల మీదుగా మెమొంటోలను అందజేశారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి నగర నలుమూల నుండి 40 వేలకు పైగా సందర్శకులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఫలు బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు క్రెడాయ్‌ వేదికగా భాగస్వామ్యం వహించడం జరిగింది. కార్యక్రమం అనంతరం లక్కీ డ్రా తీసి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తికి కారును అందజేశారు.

Social Share Spread Message

Latest News