Skip to main content

Namaste NRI

ఐసీసీని హెచ్చరించిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్‌ అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఇటీవల పుతిన్‌ అరెస్టుకు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అణుశక్తి అధ్యక్షుడిని విచారించాలని నిర్ణయించిందని, అయితే, కోర్టులోని న్యాయమూర్తులు ప్రధాన అణుశక్తికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దని మెద్వెదేవ్ సూచించారు. హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై క్షిపణి పడవచ్చన్న మెద్వెదేవ్, అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తులు ఆకాశం వైపు ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ఇదిలా ఉండగా  ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు రష్యా అధ్యక్షుడిపై వారెంట్‌ను జారీ చేసింది. అయితే, ఈ అరెస్ట్  వారెంట్‌పై రష్యా ప్రభుత్వం ఐసీసీ అధికార పరిధిని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events