Skip to main content

Namaste NRI

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన బాధితులకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 10 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రక్షణ చర్యల పట్ల యాజమాన్యం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో ప్రమాద ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించిన తర్వాత నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News