Skip to main content

Namaste NRI

ధనుష్, రష్మిక మందన్న ముంబైలో కుబేర షూటింగ్

ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం కుబేర. రష్మిక మందన్న కథానాయిక. అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకుడు  సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయ్‌లో జరుగుతున్నది. 12రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ధనుష్‌, రష్మిక, ఇతరులతో కూడిన కీలకమైన టాకీపార్ట్‌ను, కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిం చనున్నట్టు మేకర్స్‌ తెలిపారు. విజువల్‌గా వండర్‌ అనిపించేలా సినిమా ఉంటుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథల్ని తెరకెక్కించే శేఖర్‌ కమ్ముల, ఈ సారి ప్రేక్షకులు ఆశ్చర్య పోయే కొత్త కంటెంట్‌తో రానున్నారనీ, పూర్తి కమర్షియల్‌ హంగులతో రూపొందుతోన్న ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్‌ తెలిపారు. జిమ్‌ సర్భ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాని కి కెమెరా: నికేత్‌ బొమ్మి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై.లిమిటెడ్‌, సమర్పణ: సోనాలి నారంగ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events