ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లిన దిల్‌రాజు పవన్‌తో సమవేశమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు దిల్ రాజు. ఇందులో భాగంగానే ఏపీలో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏపీలో నిర్వహించ బోతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పవన్ రావాలని దిల్ రాజు కోరడంతో జనసేనాని ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 04న రాజమండ్రిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.