భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయేషా నిర్ధారించింది. వీరిద్దరికి 2012లో వివాహం కాగా జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన అయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన థావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్ లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలతో అయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై అయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది.