Skip to main content

Namaste NRI

తక్కువ అంచనా వేయొద్దు… ఇదే చివరిది కాదు

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పాటు ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎంతో వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మూడోవేవ్‌ ప్రారంభమైంది. భారత్‌లోనూ అదే ముప్పు మొదలైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఉద్దేశిస్తూ ప్రపంచ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వారంలో 71 శాతం కేసుల పెరుగుదల ఎంతో ఆందోళనకరమని తెలిపింది. కొత్త వేరియంట్‌ ప్రాణాంతకం అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ మాట్లాడుతూ డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫలితంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

                        ఇప్పటికే చాలా దేశాల్లో  ఆస్పత్రులు ఒమిక్రాన్‌ కేసులతో నిండిపోయాయని వివరించారు. కరోనా మహమ్మారిలో ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేమని టెడ్రోస్‌ అధనోమ్‌ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొంత మంది వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంత మంది వ్యక్తులు మాస్కులు ముఖానికి కాకుండా గడ్డానికి ధరిస్తున్నారని దాంతో ప్రయోజనం లేదన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events