Namaste NRI

డాక్టరు, డైరెక్టర్‌ ఒకటయ్యారు

టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్ జాగర్లమూడి  హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ప్రీతి చల్లా ను వివాహం చేసుకున్నాడు.  పెండ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవాళ మనం డాక్టర్ ప్రీతి చల్లా జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని జరుపుకుంటున్నాము. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆమె ప్రయాణంలో అంతులేని ఆనందం, నవ్వుల కలయిక ఉండాలని కోరుకుంటున్నామని ప్రీతి చల్లా టీం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది.

క్రిష్‌కు ఇది రెండో పెండ్లి. మొదటి భార్య కూడా డాక్టర్ కాగా క్రిష్‌ ఆమెకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్‌. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న హరిహరవీమల్లుపై వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్‌ మరోవైపు అనుష్కా శెట్టితో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]