Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ సాయం కోరిన…డొనాల్డ్‌ ట్రంప్‌

వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్పేస్‌ ఎక్స్‌ అధినేత, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ను సాయం కోరారు.

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను కోరినట్లు మస్క్‌ తాజాగా తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా నెలలుగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు గత బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్ట లేదని విమర్శించారు. బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యోమగాములు నెలలుగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చిందన్నారు. వారు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఆ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. ఇందుకోసం ట్రంప్‌ స్పేస్‌ఎక్స్‌ సాయం కోరినట్లు చెప్పారు. అధ్యక్షుడి అభ్యర్థన మేరకు త్వరలో ఆ పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events