అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొవిడ్ వ్యాక్సిన్, కరోనా మరణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భారీ విపత్తు నుంచి అమెరికా బయటపడిరదన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కరోనా విజృంభణ వేళ మా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. యుద్ద ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో భారీ విపత్తు తప్పింది. లేకుంటే అమెరికాలో బహుశా 10 కోట్ల మరణాలు నమోదయ్యేవేమో. దీనికి నేను నిజంగా గర్వ పడుతున్నాను అని వ్యాఖ్యానించారు