Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ అర్హుడు కారు: పోలండ్‌ స్పీకర్‌

పశ్చిమాసియాలో శాంతిని తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌, ఇజ్రేలీ స్పీకర్‌ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతు ఇవ్వబోనని పోలిష్‌ స్పీకర్‌ వోడ్జిమీర్జ్‌ జర్‌జాస్టి ప్రకటించడం వివాదాస్పదమైంది. ట్రంప్‌ నోబెల్‌ బహుమతికి అర్హుడు కారంటూ జర్‌జాస్టి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అమెరికా రాయబారి టామ్‌ రోస్‌ తమ అధ్యక్షుడిని అవమానించినందుకు పోలిస్‌ స్పీకర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News