Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను మూసివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు.అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వైట్‌హౌస్‌ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌,  విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు. దీన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రకటించారు. ఈ శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు విద్యాశాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News