Skip to main content

Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్వాంటెనామో బేలో శరణార్థుల జైలు నిర్మాణానికి ఆదేశం ఇచ్చారు. సుమారు 30 వేల మంది శరణార్థులను బంధీ చేసే రీతిలో ఆ డిటెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. తీవ్ర స్థాయి క్రిమినల్స్ను ఆ జైళ్లలో బంధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్వాంటనామో బేలో కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే బంధీ చేసేవారని, ఇక నుంచి నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారుల్ని అక్కడి జైళ్లలో వేయనున్నారు.
కొత్త ఆదేశాలకు చెందిన మెమోరాండంపై ట్రంప్ సంతకం చేశారు. డిఫెన్స్, హోంలాండ్ సెక్యూర్టీ శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. చాలా మందికి ఈ విషయం తెలియదని, గ్వాంటనామో బేస్లో సుమారు 30 వేల మంచాలు ఉన్నాయని, అమెరికా ప్రజలను వేధించే నేరగాళ్లను దాంట్లో ఖైదు చేయనున్నట్లు వైట్హౌజ్లో ట్రంప్ పేర్కొన్నారు. కొందరు నేరగాళ్లు చాలా క్రూరంగా ఉన్నారని, వాళ్లను వాళ్ల స్వంత దేశాలు కూడా పట్టుకోలేవని, అలాంటి నేరగాళ్లను గ్వాంటనామో బేలో వేయనున్నట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News