Skip to main content

Namaste NRI

నెవాడాలో డొనాల్డ్ ట్రంప్ విజయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెవాడాలో విజయం సాధించారు. 2004లో అధ్యక్షుడు జార్జి డబ్లు బుష్ విజయం తరువాత నెవాడా రాష్ట్రాన్ని, అక్కడి ఆరు ఎలక్టొరల్ వోట్లను ట్రంప్ రిపబ్లికన్ల పరం చేశారు. ట్రంప్, డెమోక్రాట్ కమలా హారిస్ ఈ ఏడాది అనేక సార్లు నెవాడా రాష్ట్రంలో పలు ప్రచార కార్యక్రమాలు సాగించారు. నెవాడా కౌంటీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే. అవి 2020లో ట్రంప్‌నకు అనుకూలంగా భారీగా వోటు వేశాయి. కానీ, ఆ ఏడాది డెమోక్రాట్ జో బైడెన్ అత్యంత జనభా గాల కౌంటీలు వాషో, క్లార్క్‌లను గెలుచుకున్నారు. క్లార్క్ కౌంటీలోనే లాస్ వెగాస్ కూడా ఉన్నది. రాష్ట్ర వాసులలో ముప్పావు వంతు ఆ కౌంటీలోనే ఉన్నారు.

Social Share Spread Message

Latest News