Skip to main content

Namaste NRI

హ్యూస్టన్ లో గాంధీ మ్యూజియానికి విరాళం

అమెరికాలోని హ్యూస్టన్‌ లో నిర్మిస్తున్న ఎటర్నల్‌ గాంధీ మ్యూజియానికి (ఈజీఎంహెచ్‌) ఫోర్ట్‌ బెంట్‌ కౌంటీ 457 వేల డాలర్లు (రూ.3.44 కోట్లు) విరాళంగా ఇచ్చింది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రచారం చేయడానికి ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చాలా వరకు ఈ నిధులు దోహదపడనున్నాయి. ఈ మ్యూజియం పనులకు గత జులైలో శంకుస్థాపన జరగగా, 2023లో పూర్తికానున్నాయి. మూడెకరాల స్థలంలో మొత్తం దాదాపు రూ.50 కోట్ల (6.5 మిలియన్‌ డాలర్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

Social Share Spread Message

Latest News