Namaste NRI

సునాక్‌ వద్దు..  మరెవరినైనా ఎన్నుకోండి

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాటు చేయాలని తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. సునాక్‌ను తప్ప మరెవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచించినట్టు తెలుస్తోంది. రిషి తనకు ద్రోహం చేశారని,  ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్‌ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న  ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్‌ బహిరంగంగా వెల్లడిరచినా, సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ  మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిసింది. తనపై అభియోగాలు రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జాన్సన్‌ ఈ నెల 7న ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events